AP: తీవ్ర తుఫాన్‌గా మారిన ‘అక్వాన్’ రేపు (శుక్రవారం) తీరం దాటే అవకాశం ఉండటంతో మూడు రాష్ట్రాలను వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. తుఫాన్ ఒడిశా వైపు దిశ మార్చుకోవడంతో అక్కడ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్ర, పశ్చిమ బెంగాల్‌లోని పలు ప్రాంతాలపైనా తుఫాన్ ప్రభావం ఉండనుంది. ఉత్తరాంధ్ర, యానాం, దక్షిణ ఒడిశాకు IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముందస్తు చర్యల్లో భాగంగా ఒడిశా ప్రభుత్వం 3 వేల తుఫాన్ షెల్టర్లను సిద్ధం చేసి, దాదాపు 50 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది.