AP: అక్వాన్ తుఫాన్ తీరం దాటే ప్రక్రియ కొనసాగుతోంది. తీవ్ర తుఫాన్ నుంచి తుఫాన్‌గా బలహీనపడిన అక్వాన్.. కాసేపట్లో తీరం దాటనుంది. ఈ మేరకు ఆంధ్రా-ఒడిశా సరిహద్దు తీర ప్రాంతంలో అధికారులు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేశారు. గంజాం-పూరీ మధ్య అక్వాన్ తుఫాన్ తీరం దాటుతోంది. తీరం దాటిన తర్వాత నాలుగు జిల్లాల్లో మాత్రమే తుఫాన్ ప్రభావం ఉంటుందని అధికారులు వెల్లడించారు.