ఈ నెల 11 నుంచి ఆక్వాన్ తుఫాన్

3చూసినవారు
ఈ నెల 11 నుంచి ఆక్వాన్ తుఫాన్
నవంబర్ 11 నుండి 16 మధ్య బంగాళాఖాతంలో 'ఆక్వాన్' (Akvan) తుఫాను ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్ర పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడి, క్రమంగా అల్పపీడనంగా మారే సూచనలున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఇరాన్ ప్రతిపాదించిన ఈ తుఫాను తీవ్రత, ప్రభావంపై వాతావరణ శాఖ (IMD) నిశితంగా పరిశీలిస్తోంది. అల్పపీడనం ఏర్పడిన తర్వాతే తీరం, ఇతర ప్రభావాల గురించి స్పష్టత వస్తుందని వాతావరణ నిపుణులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్