గంటకు 5కి.మీ వేగంతో కదులుతున్న 'అర్నబ్' తుపాను

22చూసినవారు
గంటకు 5కి.మీ వేగంతో కదులుతున్న 'అర్నబ్' తుపాను
తూర్పు మధ్య, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గంటకు 5 కి.మీ వేగంతో కదులుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది ప్రస్తుతం విశాఖకు 880 కి.మీ, కాకినాడకు 980 కి.మీ, మచిలీపట్నానికి 1,080 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఆదివారం తీవ్ర వాయుగుండంగా, సోమవారం తుపానుగా మారే అవకాశం ఉంది. ఈ తుపానుకు 'అర్నబ్' అని పేరు పెట్టారు. ఇది 28వ తేదీన అతి తీవ్ర తుపానుగా మారి బాపట్ల-విశాఖ మధ్య తీరం దాటనున్నట్లు అంచనా వేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్