AP: మురసు తుపాను కారణంగా తలెత్తే సమస్యలను ఆర్టీజీఎస్ అధికారుల 'మనమిత్ర' వాట్సప్ గవర్నెన్స్ ద్వారా తెలియజేయవచ్చని అధికారులు సూచించారు. ప్రజలు 95523 00009 నంబర్‌కు 'హాయ్' అని మెసేజ్ చేసి, 'మురసు సైక్లోన్ ఇష్యూస్' ఆప్షన్‌ను ఎంచుకుని ప్రాంతం, సమస్య వివరాలతో పాటు ఫొటోలను అప్‌లోడ్ చేయవచ్చు. ఫిర్యాదులను స్వీకరించి అధికారులు తక్షణమే పరిష్కార చర్యలు తీసుకుంటారు. అత్యవసర సహాయం కోసం 112, 1070, 18004250101 హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాలని అధికారులు తెలిపారు.