బ్రహ్మపుత్ర నదిపై 16,800 కోట్ల డాలర్ల వ్యయంతో చైనా భారీ జల విద్యుత్ ప్రాజెక్టును చేపట్టనుంది. ఆగస్టు 26న చైనా-నేపాల్ సరిహద్దులో జరిగిన విపత్తులో 1,500 మంది మృతి చెందగా, ఈ నూతన ప్రాజెక్టుతో మరిన్ని వరదలు, భూకంప ముప్పు పొంచి ఉందని స్వయంగా చైనా నిపుణులే హెచ్చరిస్తున్నారు. భూతాపం వల్ల మంచు కరిగి నది ప్రవాహంలో హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయని, ఇది
భారత్, బంగ్లాదేశ్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంపై శాస్త్రవేత్తలు అనుమానాలు వ్యక్తం చేశారు.