
తెలంగాణలో లక్ష మంది విద్యార్థులకు ఉచిత ఏఐ, క్లౌడ్ శిక్షణ: మంత్రి శ్రీధర్ బాబు
తెలంగాణలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ శిక్షణ అందించనున్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ సహకారంతో టాస్క్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 643 కళాశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా ఇంజినీరింగ్, జనరేటివ్ ఏఐలో శిక్షణతో పాటు 900కు పైగా డిజిటల్ కోర్సులు అందుబాటులో ఉంటాయి. శిక్షణ పూర్తిచేసిన అర్హులకు ప్రత్యేక జాబ్ మేళాలు నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు.




