దావూద్ ఇబ్రహీం సీక్రెట్ లైఫ్ బట్టబయలు!.

15చూసినవారు
దావూద్ ఇబ్రహీం సీక్రెట్ లైఫ్ బట్టబయలు!.
అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం రహస్య జీవితంపై మాజీ ఎఫ్‌బీఐ ఏజెంట్ కామ్రాన్ ఫరీదీ సంచలన విషయాలు వెల్లడించారు. పాకిస్థాన్‌లో దావూద్‌కు '22 నంబర్ జమ్‌జమా' అనే రహస్య స్థావరం ఉందని, అక్కడ విలాసవంతమైన జీవితం గడుపుతాడని కామ్రాన్ ఆరోపించారు. మద్యం, కొకైన్ అలవాట్లు ఉన్నాయని, చోటా షకీల్ భద్రతలో ఐఎస్ఐ పర్యవేక్షణలో దావూద్ ఉంటాడని ఆయన పేర్కొన్నారు. తాను ఎఫ్‌బీఐ ఏజెంట్‌గా దావూద్ నెట్‌వర్క్‌లోకి చొరబడినప్పుడు ఈ విషయాలను గమనించానని కామ్రాన్ తెలిపారు. ఈ ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి.

సంబంధిత పోస్ట్