తమిళనాడులోని తిరువల్లూరు జిల్లా ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో బల్లి పడటంతో కలకలం రేగింది. శుక్రవారం ఉదయం ఉచిత అల్పాహార పథకంలో భాగంగా వడ్డించిన సాంబార్లో బల్లి కనిపించడంతో, దానిని తిన్న సుమారు 40 మంది
విద్యార్థులు వాంతులు, కళ్లు తిరగడం వంటి లక్షణాలతో అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులను వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారని పోలీసులు, స్థానికులు తెలిపారు.