తెలంగాణలో పీఎం కిసాన్ పథకం లబ్ధిదారుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గత నాలుగు నెలల్లోనే 17 వేలకు పైగా తగ్గగా, ప్రస్తుతం 29.95 లక్షల మందికి మాత్రమే సాయం అందుతోంది. పథకం ప్రారంభమైన 2019 నుంచి ఇప్పటివరకు లబ్ధిదారుల సంఖ్య 7.81 లక్షలు తగ్గింది. రైతుల మరణాలు, వారసుల్లో ఒక్కరికే అవకాశం, కొత్త భూముల కొనుగోలుదారులకు అర్హత లేకపోవడం, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు తదితర కారణాలతో ఈ తగ్గుదల నమోదవుతోంది. నిబంధనలు సడలించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది.