హైదరాబాద్‌లోని మలక్‌పేట్‌లో జింక మాంసంతో ముగ్గురు వ్యక్తులు పట్టుబడటం కలకలం రేపింది. పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో సయ్యద్ హుస్సేన్, సయ్యద్ ఒమర్, మహ్మద్ హమీద్ అనే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి జింక మాంసంతో పాటు ఒక రైఫిల్, 8 బుల్లెట్లు, 12 ఖాళీ కార్ట్రిడ్జ్లు, రెండు నైట్ విజన్ టెలిస్కోప్‌లు, నాలుగు మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకలోని కలబురగి అటవీ ప్రాంతంలో వీరు జింకల వేటకు వెళ్లి, 12 రౌండ్ల కాల్పులు జరిపినట్లు విచారణలో వెల్లడైంది.