తమిళనాడు రాజకీయాల్లో హీరో ధనుష్ ఎంట్రీపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. తాజాగా ఆయన AIADMKలో చేరుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు AIADMK చీఫ్ ఈ. పళనిస్వామి కుమారుడు మిథున్‌తో చర్చలు జరిపినట్లు సమాచారం. ధనుష్ చేరికపై స్పష్టత వస్తే, ఆయనకు పార్టీలో కీలకమైన జాయింట్ జనరల్ సెక్రటరీ లేదా యూత్ వింగ్ సెక్రటరీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు, ఈ పరిణామం వెనుక
బీజేపీ ఉందని TVK పార్టీ ఆరోపిస్తోంది. ఈ రాజకీయ పరిణామాలు తమిళనాట చర్చనీయాంశంగా మారాయి.