
తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. ఉత్తరాంధ్రలో ఎడతెరిపిలేకుండా వర్షాలు
తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం-పోలాకి మధ్య తీవ్ర వాయుగుండం తీరం దాటింది. దీని ప్రభావం మరో 12 గంటల పాటు తీవ్రంగా కొనసాగనుంది. ఈదురుగాలుల ధాటికి విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలిపోగా.. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు మరో 48 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.




