హెల్త్ టిప్స్ ఇచ్చిన ధోనీ (VIDEO)

72చూసినవారు
ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక శ్రమ తప్పనిసరని టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ సూచించారు. ప్రస్తుత తరంలో ఫిజికల్‌ యాక్టివిటీ తగ్గిపోయిందని, చిన్నప్పటి నుంచే పిల్లలు క్రీడల్లో పాల్గొనాలని అన్నారు. రోజుకు కనీసం గంటసేపు ఆటలు లేదా ఇతర శారీరక వ్యాయామాలకు కేటాయించాలని సూచించారు. ఫిట్‌నెస్‌ లేకపోతే పిల్లలతో కూడా సరిగా ఆడుకోలేమని పేర్కొన్నారు. క్రీడల్లో పాల్గొనేవారి మధ్య వయసు ఆరోగ్యం మెరుగ్గా ఉండే అవకాశం ఉందని చెబుతూ, చక్కెర ఎక్కువగా ఉండే ఆహారం, వేయించిన పదార్థాలకు దూరంగా ఉండాలని ఓ కార్యక్రమంలో ధోనీ సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్