చెన్నై సూపర్ కింగ్స్ (CSK)లో మహేంద్రసింగ్ ధోనికి కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు ఆటగాడిగా, కెప్టెన్‌గా జట్టుకు సేవలందించిన ధోని ఇకపై కోచ్ లేదా మెంటార్‌గా కొనసాగించే అంశంపై యాజమాన్యం చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనకు ధోని కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. అయితే కోచ్ లేదా మెంటార్‌గా ధోని కొత్త పాత్రపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.