చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం అధికారికంగా ధృవీకరించింది. రిటైర్మెంట్ తర్వాత ధోనీ ఇకపై జట్టుకు మెంటార్‌గా వ్యవహరిస్తారని టీమ్ యాజమాన్యం పేర్కొంది. సుదీర్ఘకాలం చెన్నై జట్టుకు కెప్టెన్‌గా సేవలందించిన ధోనీ, ఇకపై కొత్త పాత్రలో జట్టుకు మార్గనిర్దేశం చేయనున్నారు. ఈ కీలక మార్పుతో ఐపీఎల్ చరిత్రలో ఒక శకం ముగిసినట్లయింది.