ధోనీ రిటైర్‌మెంట్‌.. సాక్షి ఎమోషనల్ పోస్ట్

39చూసినవారు
ధోనీ రిటైర్‌మెంట్‌.. సాక్షి ఎమోషనల్ పోస్ట్
19 ఏళ్ల ఐపీఎల్ కెరీర్‌కు మహేంద్ర సింగ్ ధోనీ ఆటగాడిగా ముగింపు పలకడంపై ఆయన భార్య సాక్షి ధోనీ భావోద్వేగ పోస్ట్ పెట్టారు. జీవితంలో అందమైన కొత్త ప్రయాణం ప్రారంభం కావాలంటే కొన్ని అధ్యాయాలు ముగియాల్సిందేనని ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. ఇన్నేళ్లుగా ధోనీని ప్రేమించి, నమ్మిన అభిమానులందరికీ ధన్యవాదాలు తెలిపారు. కొత్త ఆరంభాలు, సరికొత్త సాహసాలు, మరెన్నో అందమైన జ్ఞాపకాలకు స్వాగతం పలుకుతూ.. మహీని చూస్తుంటే గర్వంగా ఉందని పేర్కొన్నారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్