తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని టీజీఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు నేతృత్వంలోని ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ నెల 17న శిల్పకళా వేదికలో నిర్వహించనున్న ‘బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్–2026’ అవార్డుల ప్రదానోత్సవానికి ముఖ్యమంత్రిని ఆహ్వానించింది. ఈ సమావేశంలో దర్శకుడు హరీశ్ శంకర్, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, చరణ్ అర్జున్, నల్గొండ గద్దర్ తదితరులు పాల్గొన్నారు.