TG: ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది. గురువారం సిద్దిపేటలో సీఎం రేవంత్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సి ఉండగా అధికారులు వాయిదా వేశారు. త్వరలో కొత్త తేదీని ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. అయితే రేవంత్ పర్యటన యథావిధిగా కొనసాగుతుందని వెల్లడించారు.