చేపలు నిద్రపోతాయా?

9చూసినవారు
చేపలు నిద్రపోతాయా?
చేపలు ఎప్పుడూ నీటిలో కదులుతూ కనిపిస్తాయి. దీంతో అవి నిద్రపోవని చాలామంది అనుకుంటారు. కానీ చేపలు కూడా విశ్రాంతి తీసుకుంటాయి. కొన్ని జాతులు నీటిలో నెమ్మదిగా కదులుతూ, మరికొన్ని సురక్షిత ప్రదేశాల్లో స్థిరంగా ఉండి విశ్రాంతి తీసుకుంటాయి. ఈ సమయంలో వాటి కదలికలు, జీవక్రియలు తగ్గుతాయి. అయితే మనుషుల మాదిరిగా కళ్లు మూసుకుని నిద్రపోవు. చేపలకు కనురెప్పలు లేకపోవడంతో అవి కళ్లు మూయవు.

సంబంధిత పోస్ట్