
భూగర్భంలో మరో రహస్య ‘మిసైల్ సిటీ’ని ప్రారంభించిన ఇరాన్
అమెరికా, ఇజ్రాయెల్‌లతో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో, ఇరాన్ తన సైనిక శక్తిని ప్రదర్శిస్తూ మరొక రహస్య భూగర్భ ‘మిసైల్ సిటీ’ని ప్రారంభించింది. ఈ కేంద్రంలో భారీ సంఖ్యలో బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులు, అధునాతన ఆయుధ వ్యవస్థలను మోహరించినట్లు సమాచారం. తమపై ఎటువంటి దాడి జరిగినా, ప్రతిస్పందన కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాకుండా చాలా భీకరంగా ఉంటుందని ఇరాన్ తీవ్రంగా హెచ్చరించింది. ఈ చర్య అంతర్జాతీయంగా ఆందోళనలను మరింత పెంచే అవకాశం ఉంది.




