ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యాలలో ఒకటి కుంకుమపువ్వు. దీని ధర కిలోకు రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు ఉంటుంది. క్రోకస్ సటైవస్ అనే పువ్వుల నుంచి సేకరించే ఈ కుంకుమపువ్వును ప్రధానంగా జమ్మూకశ్మీర్లోని పాంపోర్ ప్రాంతంలో పండిస్తారు. ఒక కిలో కుంకుమపువ్వు తయారీకి సుమారు 1.5 లక్షల పువ్వులు అవసరమవుతాయి. పూల సేకరణ, ఎర్రటి భాగాలను వేరు చేయడం వంటి పనులన్నీ చేతితో చేయాల్సి రావడం, అత్యంత కఠినమైన సాగు విధానాల వల్ల దీని ఉత్పత్తి ఖర్చు పెరిగి, మార్కెట్లో అధిక ధర పలుకుతోంది.