ప్రపంచంలో తొలి ఆపరేషనల్ ఏటీఎంను 1967 జూన్ 27న బ్రిటన్‌లోని లండన్ సమీపంలోని ఎన్ఫీల్డ్‌లో బార్క్లేస్ బ్యాంక్ ఏర్పాటు చేసింది. స్కాట్లాండ్ ఇంజినీర్ జాన్ షెపర్డ్-బారన్ రూపొందించిన ఈ యంత్రాన్ని నటుడు రెగ్ వార్నీ ప్రారంభించారు. తొలి ఏటీఎం నుంచి నగదు తీసుకున్న వ్యక్తి కూడా ఆయనే. అప్పట్లో డెబిట్ కార్డులు, పిన్‌లు లేవు. బ్యాంకు ఇచ్చే ప్రత్యేక పేపర్ వోచర్‌ను యంత్రంలో పెట్టి ఒక్కో లావాదేవీలో 10 పౌండ్ల నోటును పొందేవారు. తర్వాత ఈ సాంకేతికత ప్రపంచవ్యాప్తంగా విస్తరించి బ్యాంకింగ్ సేవల్లో కీలక మార్పు తీసుకొచ్చింది.