పోలీసుల సమక్షంలోనే వైద్యురాలిపై దాడి (వీడియో)

6చూసినవారు
మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో పోలీసుల సమక్షంలోనే ఓ నిందితుడు వైద్యురాలిపై దాడి చేశాడు. గురువారం తలేగావ్‌ శ్యామ్‌జీపంత్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య పరీక్షల అనంతరం పత్రాలపై సంతకాలు చేస్తూ ఉన్న వైద్యురాలి చెంపపై కొట్టాడు. వెంటనే స్పందించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. మహిళపై బ్లేడుతో దాడి చేసిన కేసులో నిందితుడిగా ఉన్న అతడిపై మరో కేసు నమోదు చేశారు. ఘటనను ఖండిస్తూ వైద్య సిబ్బంది కొంతసేపు సేవలు నిలిపివేశారు.

సంబంధిత పోస్ట్