నేటి నుంచి వారం రోజుల పాటు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్, రేషన్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అవసరం. వితంతు పింఛను కోసం భర్త మరణ ధ్రువీకరణ పత్రం, ఒంటరి మహిళ పింఛను కోసం విడాకుల పత్రం లేదా వివాహం కాలేదని MRO జారీ చేసిన ధ్రువీకరణ పత్రం, దివ్యాంగుల పింఛను కోసం సదరమ్ సర్టిఫికేట్, హిజ్రాల పింఛను కోసం జిల్లా మెడికల్ బోర్డు ధ్రువీకరణ పత్రం అవసరం. ఆన్లైన్లో దరఖాస్తు నమోదు కాగానే సంబంధిత సిబ్బంది ఒక రసీదు ఇస్తారు.