ఆఫీసులో కుక్కల హల్‌చల్‌.. ట్రెండింగ్‌లో వీడియో

24చూసినవారు
మహారాష్ట్రలోని నిఫాడ్‌ నగర్‌ పంచాయతీ కార్యాలయంలో వీధికుక్కల సమస్యపై వినూత్న నిరసన జరిగింది. యువసేన జిల్లా అధ్యక్షుడు విక్రమ్‌ రాంధవే ఆధ్వర్యంలో కార్యకర్తలు కొన్ని వీధికుక్కలను కార్యాలయంలోకి తీసుకెళ్లి చీఫ్‌ ఆఫీసర్‌ ధీరజ్‌ భామ్రే టేబుల్‌పై వదిలారు. అంతేకాకుండా కరెన్సీ నోట్లతో దండ వేసి నిరసన తెలిపారు. నిఫాడ్‌లో కుక్కల సంఖ్య పెరిగి చిన్నారులు, వృద్ధులు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారని, పలువురు కుక్కకాటుకు గురయ్యారని వారు ఆరోపించారు. స్టెరిలైజేషన్‌తో పాటు కుక్కలను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

సంబంధిత పోస్ట్