అన్ని మెట్రో స్టేషన్లను మూసివేయొద్దు: సుప్రీం

32చూసినవారు
అన్ని మెట్రో స్టేషన్లను మూసివేయొద్దు: సుప్రీం
సీఈసీకి వ్యతిరేకంగా సీజేపీ భారీ ఆందోళనలకు పిలుపునివ్వడంతో కేంద్రం దిల్లీలో ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలపై సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. నిరసన తెలిపే పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడటంతో పాటు శాంతిభద్రతలను పరిరక్షించడం కూడా అంతే ముఖ్యమని వ్యాఖ్యానించింది. పనుల కోసం ప్రజలు నగరంలోని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణిస్తుంటారని.. కాబట్టి అన్ని మెట్రో స్టేషన్లను మూసివేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. మూసివేసి ఉన్న మెట్రో స్టేషన్ల సంఖ్య తగ్గించాలని కేంద్రానికి సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్