నేటి నుంచి మహాలయ పక్షం (పితృపక్షం) మొదలైంది. ఈ సమయంలో మరణించిన తల్లిదండ్రులు, పూర్వీకుల ఆత్మ శాంతి కోసం శ్రాద్ధకర్మలు, పితృతర్పణం చేయవచ్చని పండితులు చెబుతున్నారు. దీనివల్ల పితృదేవతల అనుగ్రహం కలిగి సంతానవృద్ధికి ఆశీర్వదిస్తారని విశ్వసిస్తారు. అయితే, ఈ పితృపక్షంలో వివాహాలు, గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాలు చేయడం మంచిది కాదని సూచిస్తున్నారు. అక్టోబర్ 10న ఇది ముగియనుంది.