యాసంగిలో వరి వేయొద్దు: CM రేవంత్ రెడ్డి

18చూసినవారు
యాసంగిలో వరి వేయొద్దు: CM రేవంత్ రెడ్డి
తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో రానున్న నెలల్లో నీరు, విద్యుత్ కొరత తీవ్రతరం అయ్యే అవకాశాలున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. యాసంగిలో రైతులు వరి పంట వేయకుండా, తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలను సాగు చేయాలని విజ్ఞప్తి చేశారు. జలాశయాల్లో నీటి నిల్వలు గణనీయంగా తగ్గాయని, పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో విద్యుత్ వినియోగం అధికమైందని తెలిపారు. అవసరమైన విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఎల్‌నినో పరిస్థితులపై కేబినెట్ సబ్‌కమిటీ, నోడల్ అధికారి ద్వారా సమీక్షలు నిర్వహించడంతో పాటు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సీఎం వెల్లడించారు.

సంబంధిత పోస్ట్