ఆఖరి వరకు వేచిచూడొద్దు.. త్వరగా అప్లై చేసుకోండి: NTA

0చూసినవారు
ఆఖరి వరకు వేచిచూడొద్దు.. త్వరగా అప్లై చేసుకోండి: NTA
యూజీసీ నెట్‌ డిసెంబర్‌ 2026 పరీక్ష దరఖాస్తుల గడువును ఎన్టీఏ అక్టోబర్‌ 31 వరకు పొడిగించింది. ఇప్పటివరకు 8.78 లక్షల మందికి పైగా రిజిస్టర్‌ చేసుకోగా, 6.92 లక్షల మంది మాత్రమే ఫీజు చెల్లించారు. మరో 1.86 లక్షల మంది ఫీజు చెల్లించాల్సి ఉంది. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలని ఎన్టీఏ సూచించింది. ఈ పరీక్షను డిసెంబర్‌ 14 నుంచి 18 వరకు, అలాగే 21న నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్