సింగరేణిని నిర్వీర్యం చేయొద్దు: కేటీఆర్

3195చూసినవారు
సింగరేణిని నిర్వీర్యం చేయొద్దు: కేటీఆర్
తెలంగాణ సిరుల మాగాణి సింగరేణి సంస్థను నిర్వీర్యం చేయొద్దని, కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ CM రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. సింగరేణి కార్మికులకు చెల్లించాల్సిన దసరా బోనస్, పెర్క్స్ పై ఆదాయపు పన్ను బకాయిలు, మారు పేర్ల బాధితులు, డిస్మిస్ అయిన కార్మికులు, కారుణ్య నియామకాలు, సొంతింటి పథకం వంటి అనేక సమస్యలపై కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణికి ట్రాన్స్కో, జెన్‌కో నుంచి రావాల్సిన రూ.60 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని, సంస్థ వాటాలను విక్రయించే ఆలోచనను విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్