AI కి కొత్త పేరు పెట్టిన డొనాల్డ్ ట్రంప్‌

98చూసినవారు
AI కి కొత్త పేరు పెట్టిన డొనాల్డ్ ట్రంప్‌
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కృత్రిమ మేథస్సు (AI)కి కొత్త పేరు సూచించారు. ఇకపై ‘ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌’కు బదులుగా ‘సూపర్‌ ఇంటెలిజెన్స్‌ (SI)’ అనే పదాన్ని వాడాలని అన్నారు. న్యూయార్క్‌లో ఐరాస సర్వసభ్య సమావేశంలో ప్రసంగించిన ఆయన.. ‘ఆర్టిఫిషియల్‌’ అంటే నకిలీ అనే భావన వస్తుందని, సాంకేతికత నిజమైనదే కాబట్టి ఆ పేరు సరైంది కాదన్నారు. ఏఐ అభివృద్ధిని అడ్డుకునే అంతర్జాతీయ నియంత్రణలను అమెరికా అంగీకరించబోదని తెలిపారు.

సంబంధిత పోస్ట్