హైదరాబాద్‌కు ‘డోర్‌డాష్‌’.. 3000 ఉద్యోగాలు

10చూసినవారు
హైదరాబాద్‌కు ‘డోర్‌డాష్‌’.. 3000 ఉద్యోగాలు
అంతర్జాతీయ ఫుడ్‌ డెలివరీ, లాజిస్టిక్స్‌ సంస్థ డోర్‌డాష్‌ భారత మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. దేశంలో తొలి డెవలప్‌మెంట్‌ సపోర్ట్‌ సెంటర్‌ను హైదరాబాద్‌లో బుధవారం ప్రారంభించింది. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం 500 మంది నిపుణులతో కార్యకలాపాలు మొదలుపెట్టిన ఈ కేంద్రంలో రానున్న రోజుల్లో ఉద్యోగుల సంఖ్యను 3,000కు పెంచాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా 5.6 కోట్లకు పైగా నెలవారీ యాక్టివ్‌ యూజర్లకు ఇక్కడి నుంచి సాంకేతిక సేవలు అందించనుంది.

సంబంధిత పోస్ట్