
ప్రముఖ ఆస్ట్రేలియన్ మోడల్ సహారా రే కన్నుమూత
ప్రముఖ ఆస్ట్రేలియన్ మోడల్ సహారా రే (34) అనారోగ్యంతో కన్నుమూశారు. ఏప్రిల్ 2024లో 'గిల్లాన్-బారే సిండ్రోమ్' అనే అరుదైన నాడీ వ్యవస్థ వ్యాధి బారిన పడిన ఆమె, చికిత్స పొందుతూ మరణించినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. జనవరిలో 'స్నో' అనే ఆడపిల్లకు జన్మనిచ్చిన ఆమె, మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్న సమయంలోనే ఈ విషాదం చోటుచేసుకోవడం అందరినీ కలిచివేసింది.




