TG: వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో భారీగా ఎండు గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయిని తరలించేందుకు యత్నిస్తుండగా బస్టాండ్ సమీపంలో ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సుమారు రూ.6 లక్షల విలువైన ఎండు గంజాయి, 3 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారయ్యారు.