
స్టార్ హీరోయిన్‌తో తమన్ డ్యాన్స్ (వీడియో)
టాలీవుడ్లో తెరకెక్కుతున్న ‘ఇట్లు అర్జున’ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అనీష్, అనస్వర రాజన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ ఉప్పల దర్శకత్వం వహించగా, వెంకీ కుడుముల నిర్మిస్తున్నారు. అక్టోబర్ 30న సినిమా విడుదల కానుంది. తాజాగా విశాఖపట్నంలోని గీతం కళాశాలలో మూడో పాట విడుదల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు తమన్, హీరోయిన్ అనస్వర రాజన్ కలిసి స్టేజ్‌పై డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.




