మహిళా సంఘాలకు డ్రోన్లు

12చూసినవారు
మహిళా సంఘాలకు డ్రోన్లు
గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పించడంతో పాటు వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతను ప్రోత్సహించేందుకు కేంద్రం ‘నమో డ్రోన్ దీదీ’ పథకాన్ని అమలు చేస్తోంది. దేశవ్యాప్తంగా 15 వేల మహిళా స్వయం సహాయక సంఘాలకు డ్రోన్లు అందించనున్నారు. డ్రోన్ కొనుగోలుపై 40 శాతం సబ్సిడీ, గరిష్ఠంగా రూ.8 లక్షల వరకు ఆర్థిక సాయం లభిస్తుంది. మిగతా మొత్తాన్ని 3 శాతం వడ్డీతో రుణంగా పొందవచ్చు. ఎంపికైన మహిళలకు డ్రోన్ నిర్వహణలో శిక్షణ ఇస్తారు. ఎరువులు, పురుగు మందుల పిచికారీ, పంటల సర్వే, మ్యాపింగ్ ద్వారా సంఘాలు ఆదాయం పొందవచ్చు. దరఖాస్తుల కోసం వ్యవసాయ శాఖ లేదా కృషి విజ్ఞాన కేంద్రాలను సంప్రదించాలి.

సంబంధిత పోస్ట్