నక్సలిజం, ఉగ్రవాద ముప్పును అంతం చేసినట్లే డ్రగ్స్పైనా పోరాటం చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. గోవాలో ఆయన మాట్లాడుతూ.. 2029 నాటికి భారతదేశాన్ని డ్రగ్స్ రహితంగా మార్చేందుకు ఒక రోడ్మ్యాప్ను సిద్ధం చేసినట్లు తెలిపారు. యువశక్తి వికసిత్
భారత్-2047 లక్ష్యానికి డ్రగ్స్ రహిత యువత మార్గం చూపుతుందని ప్రధాని
మోదీ భావిస్తున్నారని అన్నారు. డ్రగ్స్ రవాణా, ఆర్థిక మూలాలను నిర్మూలించే చర్యల్లో రాష్ట్రాలను భాగస్వాములను చేస్తామని ఆయన వెల్లడించారు.