
హైదరాబాద్‌లో గుట్టురట్టు.. హాస్టల్ ముసుగులో అండాల అక్రమ దందా
హైదరాబాద్‌లోని బేగంపేట ప్రకాశ్ నగర్‌లో గర్ల్స్ హాస్టల్ ముసుగులో జరుగుతున్న అండాల అక్రమ సేకరణ మరియు వ్యభిచార ముఠాను పోలీసులు శుక్రవారం ఛేదించారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి ఆదేశాల మేరకు పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. గత ఏడాది కాలంగా బీహార్, ఉత్తర ప్రదేశ్, ఒడిశాకు చెందిన 10 మంది యువతులను బంధించి, ఫెర్టిలిటీ సెంటర్ల కోసం అండాలను అక్రమంగా సేకరిస్తున్నట్లు గుర్తించారు. ఈ కేసులో నలుగురు నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెట్‌వర్క్ వెనుక ఉన్న ఫెర్టిలిటీ సెంటర్ల పాత్రపై బేగంపేట పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.




