TG: హైదరాబాద్ పాతబస్తీలో అజీజ్ అనే వ్యక్తి మద్యం మత్తులో పోలీసులపై దాడికి పాల్పడ్డాడు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన అజీజ్.. ఆగ్రహంతో ట్రాఫిక్ ఎస్సైని కిందకు నెట్టి, నగ్నంగా వీరంగం సృష్టించేందుకు ప్రయత్నించాడు. అనంతరం నిందితుడిని పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండగా, విధుల్లో ఉన్న కానిస్టేబుల్ వేలిని కొరికేశాడు. ర్యాపిడో రైడర్‌గా పనిచేస్తున్న అజీజ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు మద్యం మత్తులో చేసిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.