రూ.3,000 కోట్ల విలువైన మాదకద్రవ్యాల పట్టివేత

10చూసినవారు
రూ.3,000 కోట్ల విలువైన మాదకద్రవ్యాల పట్టివేత
లక్షద్వీప్‌కు పశ్చిమాన అరేబియా సముద్రంలో భారత తీర రక్షక దళం అధికారులు సెప్టెంబర్ 25న భారీ ఆపరేషన్ నిర్వహించారు. గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళం సమన్వయంతో, ఓ ఇరాన్ పడవను అడ్డగించి, సుమారు 526 కిలోల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.3,000 కోట్లు ఉంటుందని అంచనా. స్వాధీనం చేసుకున్న సరకులో హెరాయిన్, మెథాంఫేటమిన్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ పడవను నడుపుతున్న ఐదుగురు పాకిస్థానీయులను అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్