అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో దుర్గా ఉత్సవ్‌ను ఘనంగా నిర్వహించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రవాస భారతీయులు ఉత్సాహంగా పాల్గొని అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. కళాకారుల సంగీత, సంప్రదాయ నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. న్యూయార్క్‌లో భారత కాన్సుల్ జనరల్ బినయా ప్రధాన్ ఈ వేడుకలకు హాజరయ్యారు. అమెరికాలో ఐదు దశాబ్దాలకుపైగా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్న ఆరు సంస్థలను ఈ సందర్భంగా సత్కరించారు.