మైసూరులో ఘనంగా దసరా ఉత్సవాలు(వీడియో)

0చూసినవారు
మైసూరులో ఘనంగా దసరా ఉత్సవాలు(వీడియో)
మైసూరులో ఈ ఏడాది దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 17 నుండి ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డ్రోన్ ప్రదర్శన ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇందులో భాగంగా ఏకంగా 3,473 డ్రోన్లతో రూపొందించిన నెమలి ఆకారం అతిపెద్ద ఏరియల్ డిస్‌ప్లేగా గిన్నిస్ రికార్డును సొంతం చేసుకుంది. మైసూరు ప్యాలెస్‌లో మంగళవారం ఆయుధపూజ ఘనంగా నిర్వహించారు. బుధవారం విజయదశమి వేడుకలతో పాటు, ప్రధాన ఆకర్షణగా నిలిచే జంబో సవారీ, టార్చ్‌లైట్ పరేడ్లు అత్యంత అట్టహాసంగా నిర్వహించనున్నారు.

సంబంధిత పోస్ట్