దసరా.. రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు

63చూసినవారు
దసరా.. రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు
TG: గాంధీ జయంతి కారణంగా దసరా రోజు మద్యం షాపులు బంద్ చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. అక్టోబర్ 2న షాపులు తీయరని సెప్టెంబర్ 30, అక్టోబర్ 1న మొత్తం రూ.419 కోట్ల అమ్మకాలు జరిగాయని వెల్లడించారు. ఇందులో సెప్టెంబర్ 30నే రూ.333కోట్ల మద్యం విక్రయాలు జరిగాయన్నారు. ఈ నెల 1న రూ.86కోట్ల సేల్స్ జరిగాయని పేర్కొన్నారు. సాధారణంతో పోలిస్తే సెప్టెంబర్ 26 నుంచి అమ్మకాలు రెట్టింపయ్యాయని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్