
కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ గడువు డిసెంబర్ 31 వరకు పెంపు
AP: రాష్ట్రంలో అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ దరఖాస్తుల పరిశీలన, సమర్పణ గడువును డిసెంబరు 31 వరకు పొడిగిస్తూ ఏపీ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 'నిధి' పోర్టల్‌లో సాంకేతిక, పాలనాపరమైన ఇబ్బందుల వల్ల సెప్టెంబరు 30తో ముగిసిన గడువును పొడిగించారు. ఈ పొడిగింపు సెకండరీ హెల్త్ ఉద్యోగులకు కూడా వర్తిస్తుందని, గడువులోగా దరఖాస్తులు పూర్తి చేయాలని కార్యదర్శి వాడ్రేవు వినయ్‌చంద్ తెలిపారు.




