
అల్వాల్లో బాలికపై గ్యాంగ్రేప్.. 8 మంది అరెస్ట్
TG: హైదరాబాద్లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటర్ చదువుతున్న బాలికపై సామూహిక అత్యాచారం ఘటన కలకలం రేపింది. బాలికకు మత్తు పదార్థాలు ఇచ్చి, వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో జర్నీ వరుణ్, నిక్కీ, నీరజ్, నిఖిల్, గణేశ్, ఆర్.వరుణ్, సంజయ్ కుమార్, చైతన్య, సి. రాజుతో సహా 8 మందిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బాలికను ఎక్కడికి తీసుకెళ్లారు, ఇంకా ఎవరైనా ప్రమేయం ఉందా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.




