ఆన్‌లైన్‌లో పాన్ కార్డు వివరాలను సులభంగా మార్చుకోండిలా!

9894చూసినవారు
ఆన్‌లైన్‌లో పాన్ కార్డు వివరాలను సులభంగా మార్చుకోండిలా!
భారత్‌లో బ్యాంకు ఖాతా తెరవడానికి, ఐటీఆర్ దాఖలు చేయడానికి, అధిక విలువ లావాదేవీలకు పాన్ కార్డు తప్పనిసరి. దీనిపై పేరు, చిరునామా, మొబైల్ నంబర్ వంటి వివరాలు తప్పుగా ఉంటే ఆన్‌లైన్‌లోనే మార్చుకోవచ్చు. NSDL లేదా UTIITSL వెబ్‌సైట్‌కు వెళ్లి, 'PANలో మార్పులు/సవరణ' ఆప్షన్ ఎంచుకుని, వివరాలు నమోదు చేసి అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి. అనంతరం రుసుము చెల్లించాలి. అప్‌డేట్ అవ్వడానికి సుమారు 15-20 రోజులు పడుతుంది. భారత్‌లో నివసిస్తున్నవారికి రూ.50 రుసుము ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్