
పన్ను చెల్లింపుదారులకు ఐటీ శాఖ ఊరట.. గడువు పొడిగింపు
ఐటీ శాఖ పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరటనిచ్చింది. ఖాతాల ఆడిటింగ్ అవసరమైన పన్ను చెల్లింపుదారులకు అసెస్మెంట్ ఇయర్ 2026-27 కోసం ఆదాయపు పన్ను రిటర్నుల (ఐటీఆర్) దాఖలు గడువును పెంచింది. ఈ మేరకు గతంలో ఉన్న అక్టోబర్ 31 గడువును నవంబర్ 21 వరకు పొడిగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఈ గడువు పొడిగింపు కేవలం అర్హత కలిగిన పన్ను చెల్లింపుదారుల వర్గాలకు మాత్రమే వర్తిస్తుందని ఐటీ శాఖ స్పష్టం చేసింది.




