ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


Nov 09, 2026, 06:11 IST/

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్.. పరిగిలో హైటెన్షన్

Nov 09, 2026, 06:11 IST
TG: వికారాబాద్ జిల్లా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోస్గిలో మృతి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త అంత్యక్రియలకు వెళ్తుండగా వికారాబాద్ జిల్లా పరిగిలోని బహార్‌పేట్ చౌరస్తా వద్ద అడ్డుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నందున అదుపులోకి తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. తన నివాసానికి వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని నరేందర్ రెడ్డి ప్రశ్నించగా, ఆయనను విడుదల చేయాలంటూ కార్యకర్తలు పోలీసు వాహనాన్ని చుట్టుముట్టి నిరసన తెలిపారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.