
ఇంటర్నెట్ వినియోగం ప్రాథమిక హక్కు.. పిల్లలకూ వర్తిస్తుంది: సుప్రీం
ఇంటర్నెట్ వినియోగం ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పిల్లలకు కూడా ఈ హక్కు వర్తిస్తుందని జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కే. వినోద్ చంద్రన్ల ధర్మాసనం పేర్కొంది. ఆన్లైన్ వేదికలపై పూర్తి నిషేధం కాకుండా, చైల్డ్ మోడ్ వంటి భద్రతా ఫీచర్లను అమలు చేయాలని సూచించింది. 2020 అనురాధా భాసిన్, 2025 ప్రజ్ఞా ప్రసూన్ కేసులను ప్రస్తావిస్తూ.. పిల్లల భద్రతను కాపాడుతూనే వారి సమాచార హక్కులను పరిరక్షించాలని కోర్టు స్పష్టం చేసింది.




